Karthika Deepam 2: జ్యోత్స్న నా కూతురే అని చెప్పేసిన దాస్.. షాక్ లో కుటుంబం!
on Jan 14, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -567 లో... అసలు మా వదినకి అలా అయ్యిందని జ్యోత్స్నకి కొంచెం కూడా బాధ లేదు.. అసలు తను మా వదిన సొంత కూతురేనా అని కార్తీక్ ని కాంచన అడుగుతుంది. కార్తీక్ టాపిక్ డైవర్ట్ చేస్తాడు.
మరొకవైపు జ్యోత్స్న, కాశీ ఇద్దరు ఒక దగ్గర మీట్ అవుతారు. నేను నీ పేరు చెప్పకుండా తప్పిస్తే నన్ను బయటకు తీసుకొని రావడానికి నువ్వు ఒక్క ప్రయత్నం కూడా చెయ్యలేదని కాశీ అంటాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నని మోసం చేసానని స్వప్న నన్ను ఛీ కొడుతుంది.. విడాకులు ఇస్తానని అంటుందని కాశీ అంటాడు. పోనిలేరా తమ్ముడు నీకు వేరే పెళ్లి చేసి నిన్ను మంచి పొజిషన్ కి తీసుకొని వస్తాను.. ఇప్పుడు నీకు సపోర్ట్ గా నేను ఉంటానని జ్యోత్స్న అంటుంది.
నేను ఫ్రాడ్ చేసినట్లు తెలిపే ఫైల్స్ ఎక్కడ ఉన్నాయని జ్యోత్స్న అడుగుతుంది. ఇంకెక్కడి ఫైల్స్ ఇంట్లో పెడితే మావయ్య గారికి దొరికాయనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. అలా చేసినందుకు కాశీపై జ్యోత్స్నకి కోపం వస్తుంది కానీ ఏం చెయ్యలేక అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
కాశీ వెనక్కి తిరిగి చూసేసరికి దాస్ ఉంటాడు. ఆ తర్వాత కాశీ చెంపచెల్లుమనిపిస్తాడు దాస్. ఆ జ్యోత్స్నతో చేతులు కలిపి ఇలా చేస్తావా అని దాస్ కోప్పడతాడు. జ్యోత్స్న అక్క మాత్రమే నన్ను అర్థం చేసుకుంది. నువ్వు ఒక చేతకాని తండ్రివి.. నువ్వు కూడా మాట్లాడుతున్నావని కాశీ అంటాడు. కాశీ వెళ్ళిపోయాక జ్యోత్స్నని ఇలాగే వదిలిపెట్టొద్దు ఎలాగైనా జ్యోత్స్న గురించి శివన్నారాయణకి చెప్పాలని అనుకొని కార్తీక్ కి ఫోన్ చేస్తాడు దాస్. నేను నిజం చెప్పేస్తానని దాస్ అనగానే వద్దు మావయ్య అని కార్తీక్ అంటాడు. అయినా దాస్ వినిపించుకోడు.
ఆ తర్వాత శివన్నారాయణ ఇంటికి దాస్ వెళ్తాడు. జ్యోత్స్న అడ్డుపడి.. నువ్వు కాశీతో మాట్లాడింది అంతా నేను విన్నానని జ్యోత్స్న అంటుంది. దాస్ ని నిజం చెప్పకని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. అయినా దాస్ వినకుండా లోపలికి వెళ్లి అందరిని పిలుస్తాడు. ప్రొద్దున చెప్పి ఉంటే నాకు ఇప్పుడు వచ్చే అవసరం ఉండేది కాదని దాస్ అంటాడు. జ్యోత్స్న మీ కూతురు కాదు వదిన.. నా కూతురు అని దాస్ అనగానే అందరు షాక్ అవుతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



